హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడైన రాధాకిషన్‌రావు అరెస్ట్ పై హైకోర్టు గురువారం స్టే మంజూరు చేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావును అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో రాధాకిషన్ రావు అరెస్ట్‌పై స్టే ఉత్తర్వులిచ్చింది. ఇందులో భాగంగానే చక్రధర్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది.
ఆయనతో పాటు పోలీసులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల12కు వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీశ్ రావుతో పాటు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ రెండో నిందితుడైన రాధాకిషన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిని జస్టిస్ కె. లక్ష్మణ్ విచారించారు.