పాదయాత్రకు అనుమతిచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తరు : హైకోర్టు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చాక పోలీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. పాదయాత్రల కోసం రాజకీయ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది. వరంగల్ జిల్లాలో పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వడం లేదంటూ షర్మిల కోర్టును ఆశ్రయించారు. పాదయాత్రకు అనుమతిచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.

రాజ్భవన్ వద్ద షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు. రాజ్భవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్రకు అనుమతి ఎందుకు నిరాకరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని తెలిపింది. దీంతో పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలకు కోర్టు సూచించింది