భైంసా ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.  శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ర్యాలీలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదుకు 300 దూరంలో మాత్రమే ర్యాలీలో పాల్గొనాలన్న హైకోర్టు.. ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని చెప్పింది. ర్యాలీ నిర్వహించే ప్రాంతంలోని మసీదు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని  పోలీసులను ఆదేశించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారెవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని హైకోర్టు తేల్చిచెప్పింది.