అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని మండిపడింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని.. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించింది . అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అనేకమంది కోర్టులకు వస్తున్నారని తెలిపింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడాల్సిందేనని.. సిటీలో ఎన్ని అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించింది. 2019లో అక్రమ నిర్మాణాలు ఎన్ని గుర్తించారు? ఏం చర్యలు తీసుకున్నారు వివరించాలని చెప్పింది. స్టేలు తొలగించాలని కోర్టుల్లో పిటిషన్లు ఎన్నివేశారో తెలపాలని అడిగింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయకపోతే కారణాలు తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 15కు వాయిదా వేసింది హైకోర్టు.