- డ్రోన్ కేసులో స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమరవీరుల స్మారకచిహ్నం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్వ్యూ నిర్వహించారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్‌పై నడుస్తున్న కేసు విచారణతోపాటు హాజరును మినహాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నం అమరజ్యోతి వద్ద డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.