భూదాన్‌‌ యజ్ఞ బోర్డు రద్దు కరెక్టే: హైకోర్టు

భూదాన్‌‌ యజ్ఞ బోర్డు రద్దు కరెక్టే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: భూదాన్‌‌ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌‌ చేస్తూ బోర్డు చైర్మన్, మెంబర్స్‌‌ దాఖలు చేసిన అప్పీళ్లను డిస్మిస్‌‌ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నియామకాన్ని సమర్థించింది. బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రకటించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాస్‌‌రావు డివిజన్‌‌ బెంచ్‌‌ ఈ నెల 6న కీలక తీర్పును వెల్లడించింది.

భూదాన్‌‌ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో 59ని సవాల్​ చేస్తూ జి.రాజేందర్‌‌ రెడ్డి, మెంబర్‌‌ వి.సుబ్రమణ్యం ఇతరులు వేసిన పిటిషన్లను సింగిల్‌‌ జడ్జి విచారించారు. వాళ్లను చైర్మన్, మెంబర్స్‌‌గా కొనసాగించాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం వాళ్లకు షోకాజ్‌‌ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నా బోర్డును రద్దు చేసింది. ఈ చర్యను సింగిల్‌‌ జడ్జి సమర్ధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పును రద్దు చేయాలని రాజేందర్‌‌రెడ్డి ఇతరులు దాఖుల చేసిన అప్పీళ్లను సీజే బెంచ్‌‌ తాజాగా విచారించి పై తీర్పు వెలువరించింది.