మైనారిటీ విద్యాసంస్థల్లో బదిలీలపై హైకోర్టు స్టే

  • మైనారిటీ విద్యాసంస్థల్లో బదిలీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ ఎడ్యుకేషనల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌ లలో పనిచేస్తున్న హెడ్మాస్టర్లు, టీచర్ల ట్రాన్సఫర్లకు ఇచ్చిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ నెల 18న జరిగే విచారణ వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 

గురుకుల సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా జూలై 6న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నాయంటూ హేమలత, ఇతర టీచర్లు వేసిన పిటిషన్లను జస్టిస్‌‌‌‌ పుల్ల కార్తీక్‌‌‌‌ ఇటీవల విచారించారు. గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ల వాదన. 

దీనిపై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఈ పరిస్థితుల్లో ట్రాన్సఫర్‌‌‌‌  గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్‌‌‌‌ న్యాయవాది చెప్పారు. వాదనల తర్వాత స్టే ఇచ్చిన న్యాయమూర్తి, గురుకులాల కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.