- వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నట్టు
- అధికారులు నిద్రపోతున్నారా?
- వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకు?
- లంచ్ తర్వాత డిటెయిల్స్ సమర్పించండి
- ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్అయ్యింది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది.
ALSO READ | మోస్ట్ వాంటెండ్ సీరియల్ కిల్లర్ అరెస్ట్.. రైళ్లో ప్రయాణించే వారే ఇతని టార్గెట్
వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ చాలా సీరియస్ అంశమని పేర్కొంది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమంది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని నిలదీసింది.
ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేతకాదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని చెప్పింది. ఆఫీసర్లకు కూడా పిల్లలున్నారని.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.