కేఏపాల్ వాదనలు..హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

కేఏపాల్ వాదనలు..హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

 నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది.  పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించారు  కేఏ పాల్.

 వాదనలు విన్న హైకోర్టు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశించింది.  ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని చెప్పింది.  మూసి బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించింది.  దీనిపై స్పందించిన   అడిషనల్  అడ్వకేట్ జనరల్ మూసీ బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే  పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి,  హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది.

ALSO READ | HYDRA: రంగనాథ్ కీలక రివ్యూ.. ఇకపై హైడ్రా ఫోకస్ వాటిపైనే..