దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలపై స్టే..

దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు పరిసరాల్లో ఉన్న ఆక్రమణల కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు నిర్వాసితులు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కూల్చివేతలపై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ALSO READ | మాదాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

నిర్వాసితుల అభ్యంతరాలను  లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని తెలిపింది కోర్టు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.