
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది స్టూడెంట్స్‌కు ఒకే టాయిలెట్ ఉం డటంపై దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన లా స్టూడెంట్ ఎన్. మణిదీప్ రాసిన లెటర్‌ను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేస్తోంది.
మరుగుదొడ్ల నిర్మాణాలు చేయడంపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. 'సరూర్‌నగర్ జూనియర్ కాలేజీల్లో 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొ డ్డి ఉంది.
రుతుస్రావం ఆగిపోయేందుకు గోళీలు వాడాల్సి వస్తోంది. సమస్యను పరిషరించాలని కోరినా స్పందించడం లేదు'అని లా స్టూడెంట్ కోర్టుకు రాసిన తన లేఖలో పేర్కొన్నారు.