- కాల్ డేటా..డిజిటల్ రికార్డులు ఇవ్వడం లేదు..
- కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఈడీ పిటిషన్
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు స్పందించింది. ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాము అడిగిన కాల్ డేటా, డిజిటల్ రికార్డులను పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖలు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపణలు చేసింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించింది.
సహాయ నిరాకరణ చేస్తున్నట్లు కనిపిస్తోందని.. దీని వల్ల తాము విచారణ చేయలేకపోతున్నామని పేర్కొంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోని చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని ఈడీ వాదించింది. ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది హైకోర్టు.
ఇవి కూడా చదవండి
60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు: జీవితమంతా కోర్టు మెట్లెక్కడమేనా..?