
- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 6 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ కె.మంగ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు. దేవీందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్‌లలో క్రిమిలేయర్ వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం 6 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.