పాలకుర్తి, వెలుగు : గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం బాగుపడుతుందని హైకోర్టు జడ్జి జె. శ్రీనివాసరావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి పాలకుర్తి సోమేశ్వర ఆలయం, బమ్మెరలో పోతన సమాధితో పాటు అగ్రి లీగల్ ఎయిడ్ సెల్‌ను శనివాం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా పాలకుర్తిలో అగ్రి లీగల్ ఎయిడ్ సెల్‌ను స్థాపించడం గర్వంగా ఉందన్నారు.
భూ చట్టాలతో పాటు, రైతుల సమస్యలను ఈ సెల్ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్క నాటారు. పాలకుర్తిలో సోమేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టు జడ్జి డి.రవీందర్ శర్మ, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుచరిత పాల్గొన్నారు.