గద్వాల, వెలుగు: అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు ఆఫీస్ బిల్డింగ్‌ను శనివారం హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేఎల్ఐ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కోర్టు ఆఫీస్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుషా, కలెక్టర్ సంతోష్ తో కలిసి ప్రారంభించారు. సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి కవిత, ఎస్పీ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు రామిరెడ్డి పాల్గొన్నారు.
కేసులను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జువ్వాడి శ్రీదేవి సూచించారు. నారాయణపేట జిల్లా కోర్టులో న్యాయమూర్తుల సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్, జిల్లా జడ్జి అబ్డుల్ రఫీ ఆమెకు స్వాగతం పలికారు. ప్రతి నెలా పోలీస్ ఆఫీసర్లతో కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. కోర్టులో ఇబ్బందులు, సిబ్బంది కొరత తదితర అంశాలను జిల్లా జడ్జిని అడిగి తెలుసుకున్నారు. సీనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ ఉన్నారు.