కేసుల సత్వర పరిష్కారానికి.. జడ్జీలు చొరవ చూపాలి : మహమ్మద్ అబ్దుల్​ రఫీ

కేసుల సత్వర పరిష్కారానికి.. జడ్జీలు చొరవ చూపాలి : మహమ్మద్  అబ్దుల్​ రఫీ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేసుల సత్వర పరిష్కారానికి జడ్జీలు చొరవ చూపాలని హైకోర్టు జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌  జడ్జిగా నియమితులైన ఆమె హైకోర్టు న్యాయమూర్తి టి మాధవీ దేవితో కలిసి శనివారం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌  కోర్టుకు వచ్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేశ్ బాబు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌  బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్  గైక్వాడ్  రఘునాథ్  బొకేలు అందించి స్వాగతం పలికారు. 

కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.  జిల్లా కోర్టు హాల్‌‌‌‌‌‌‌‌లో జిల్లా జ్యుడిషరీ హాల్, డిజిటల్  లైబ్రరీ, మహిళా బార్  అసోసియేషన్  ఛాంబర్, వీడియో కాన్ఫరెన్స్  ఛాంబర్, క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. ఆయా కోర్టుల్లో ఉన్న సమస్యలపై సమీక్షించారు. జిల్లాలో 14వేల కేసులు పెండిండ్​లో ఉన్నాయని, వీటిలో రాజీ అయ్యే కేసులను నేషనల్  లోక్  అదాలత్  ద్వారా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని కోరారు. 

జిల్లాలోని ఫాస్ట్  ట్రాక్  కోర్టుకు అధికారులను కేటాయించాలని హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. బార్  అసోసియేషన్  ప్రెసిడెంట్  రాధాకృష్ణ, హైకోర్టు బార్  అసోసియేషన్  ప్రెసిడెంట్  రవీందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.

పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

నారాయణపేట, వెలుగు: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా జడ్జి మహమ్మద్  అబ్దుల్​ రఫీ  సూచించారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో జరిగిన కో ఆర్డినేషన్   మీటింగ్ లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. సెప్టెంబర్ 14న జరిగే జాతీయ లోక్  అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. 

గతంలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల కంటే  ఎక్కువ కేసులను పరిష్కరించి నారాయణపేట జిల్లా ముందు వరుసలో ఉందన్నారు. రాజీమార్గంలో కేసులను  పరిష్కరించాలని సూచించారు. న్యాయమూర్తులు జి.శ్రీనివాస్, మహమ్మద్ ఉమర్, జకీయా సుల్తానా, పీపీలు ఆకుల బాలప్ప, సురేశ్ కుమార్, విజయ భాస్కర్  పాల్గొన్నారు.