హైదరాబాద్, వెలుగు : హైకోర్టు చరిత్రలో ఒకే ఒక్క రోజు ఏకంగా 185 పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ పరిష్కరించి రికార్డ్ క్రియేట్ చేశారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివాదాలు, రెవెన్యూ పరిపాలనా వ్యవహారాలకు చెందినవి ఉన్నాయి. తెలంగాణ హైకోర్టులో సుమారు 2.43 లక్షల కేసుల దాకా పెండింగ్ ఉంటే..
వాటిలో 30 ఏళ్లకుపైబడి 2 వేలు, 20 నుంచి 30 ఏళ్లలోపు కేసులు 3 వేలు, 10 నుంచి 20 ఏళ్ల మధ్య కాలంలోని 32 వేలున్నాయి. పదేళ్లకు పైబడిన పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకునే క్రమంలో న్యాయమూర్తి ఒకే రోజు ఏకంగా 185 కేసుల్ని పరిష్కరించి కొత్త రికార్డు నమోదు చేశారు.