న్యాయసేవలకు దూరమయ్యామనే భావన రానీయొద్దు : సామ్​కోషి

నిజామాబాద్, వెలుగు: సామాన్య ప్రజలు న్యాయసేవలకు దూరం కాకుండా పనితీరు ఉండాలని హైకోర్టు జడ్జి పి.సామ్​కోషి పేర్కొన్నారు. వ్యవస్థపై నెగెటివ్​ఆలోచన రానీయకుండా జుడీషియరీ  పనిచేయాలన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్​లో లీగల్​సర్వీసెస్​మాడ్యూల్​క్యాంప్​ను ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో విధులు నిర్వహించే వారు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలన్నారు.

హైకోర్టు జడ్జి సి.సుమలత మాట్లాడుతూ కష్టాలను అధిగమించే లక్ష్యం పెట్టుకొని ఎదగాలన్నారు. జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ.. వాలంటరీ ఆర్గనైజేషన్స్​ భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లోక్​అదాలత్ ​ద్వారా జిల్లాలో  ఇప్పటిదాకా 38,497 కేసులు పరిష్కరించి రూ.22.55 కోట్ల పరిహారాన్ని బాధితులకు ఇప్పించామన్నారు.  కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతు, పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ, అడిషనల్ ​కలెక్టర్​ చిత్రామిశ్రా, గోవర్ధన్, పద్మావతి, రాజేందర్​రెడ్డి, బార్​అసోసియేషన్​ అధ్యక్షుడు దేవదాస్​ పాల్గొన్నారు.

కామారెడ్డిటౌన్: సమాజంలో ప్రతీఒక్కరికి న్యాయం జరిగేలా న్యాయవృత్తిలో పనిచేసేవారు కృషి చేయాలని హై కోర్ట్​జడ్జి సామ్​కోషి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కామారెడ్డి కోర్టులో జ్యూడిషియల్​ఆఫీసర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతిఒక్కరు తోటి వారికి సాయమందించాలన్నారు. లోక్​అదాలత్​లలో కేసుల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లా జడ్జి శ్రీదేవి, కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, అదనపు జిల్లా జడ్జి లాల్​సింగ్, ఎస్పీ బి.శ్రీనివాస్​రెడ్డి, బార్​అసోసియేషన్ ​ప్రెసిడెంట్ ​శ్రీధర్ పాల్గొన్నారు.