సామాజిక బాధ్యతతో సమస్యలు పరిష్కారం : జడ్జి  సుజయ్​పాల్​

సామాజిక బాధ్యతతో సమస్యలు పరిష్కారం :  జడ్జి  సుజయ్​పాల్​

కామారెడ్డి, వెలుగు: స్వచ్ఛందంగా, సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి చేయాలని హై కోర్జు జడ్జి జస్టిస్ ​ సుజయ్​పాల్​అన్నారు.  శనివారం జిల్లా పోలీసు ఆఫీసులో కమ్యూనిటీ మీడియేషన్​ వాలంటీర్లతో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  సుజయ్​పాల్​మాట్లాడుతూ..  చిన్న తగదాలతో పోలీస్​ స్టేషన్​లు, కోర్టుల వరకు వెళ్లి టైం, ధనం వృథా చేసుకుంటున్నారన్నారు. కేరళ, మధ్యప్రదేశ్​ స్టేట్స్‌‌‌‌‌‌‌‌లో  మీడియేషన్​ సెంటర్ల ద్వారా 5 వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగిందన్నారు.  

హైకోర్టు జడ్జి జె. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..  సామాజిక కార్యకర్త, పెద్ద మనుషుల సమక్షంలో తగాదాలను పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు పని చేయాలన్నారు. రెండు రోజుల ట్రైనింగ్ అనంతరం వాలంటీర్లను నియమించామన్నారు.  కలెక్టర్​ఆశిష్ సంగ్వాన్​, ఎస్పీ సింధూశర్మ, స్టేట్​న్యాయ సేవాధికార సంస్థ మెంబర్​ సెక్రెటరీ పంచాక్షరి, కామారెడ్డి జిల్లా జడ్జీ సీహెచ్​వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర ప్రసాద్, అడిషనల్​ జిల్లా జడ్జి లాల్‌‌‌‌‌‌‌‌ సింగ్ శ్రీనివాస్​నాయక్​,  సీనియర్​ సివిల్​జడ్జి నాగరాణి, జడ్జిలు  కె.సుధాకర్​, దీక్ష,  తదితరులు పాల్గొన్నారు. ​   


రాతి కట్టడాలను కాపాడాలి


భిక్కనూరు:  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న కోనేరును రాష్ట్ర లీగల్​సర్వీసెస్​అథారిటీ చైర్మన్ హైకోర్టు జడ్జి జస్టిస్​సృజన్​పాల్, కామారెడ్డి కోర్టు జడ్జి శ్రీనివాస్​ రావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇలాంటి రాతి కట్టడాలను ముందు తరాలకు పరిచయం చేయడం కోసం ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ కాపాడాలని ఆఫీసర్లకు సూచించారు.  

ఆలయ చరిత్రను అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ జడ్జిలకు వివరించారు. వారితో పాటు తహసీల్దార్​శివ ప్రసాద్, ఇంచార్జ్​ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఆలయ ఈవో శ్రీధర్, జీపీ సెక్రెటరీ మహేశ్ గౌడ్ 
ఉన్నారు.