కూల్చివేతలు చట్టప్రకారం జరగాలి

  • మరోసారి హైకోర్టు ఉత్తర్వులు జారీ 

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లి మండలం గుట్టలబేగంపేట ప్రాం తంలో దుర్గం చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌  ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీ సులనే షోకాజ్‌‌‌‌ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

 బాధి తులు ఇచ్చే వివరణను తీసుకుని చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు  ప్రాం తానికి సంబంధించి అధికారులు జారీచేసి న కూల్చివేత నోటీసులను సవాలు చేస్తూ దాఖ లైన దాదాపు 20 పిటిషన్లపై చీఫ్​ జస్టిస్‌‌‌‌  అలోక్‌‌‌‌  అరాధే, జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన  బెంచ్​ మంగళవారం విచారణ చేపట్టింది.