అక్రమ మైనింగ్​పై రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

అక్రమ మైనింగ్​పై రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలేంటో చెప్పాలంటూ రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ అక్రమ మైనింగ్​పై వెంటనే ఇరిగేషన్‌‌‌‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ 2 జిల్లాల కలెక్టర్లు కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అడ్డగూడూరు మండలం జానకీపురం, చిర్రాగూడు గ్రామాల్లోని బిక్కేరువాగు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నా ప్రభుత్వం పట్టించుకోట్లేదని వి.మల్లేశ్​తో పాటు మరో 8 మంది పిల్‌‌‌‌ వేశారు. చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీష్‌‌‌‌చంద్ర శర్మ, జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలి డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించి  నోటీసులిచ్చింది. కూకట్‌‌పల్లి హౌసింగ్‌‌ బోర్డులో పార్కు కోసం కేటాయించిన 2.36 జాగలో కమర్షియల్‌‌ బిల్డింగ్‌‌ కట్టాలని తెలంగాణ హౌసింగ్‌‌ బోర్డు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తప్పుబట్టింది. బోర్డు చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా 2004లో జీహెచ్‌‌ఎంసీ నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. ఈ చర్యను 2017లో సింగిల్‌‌ జడ్జి తప్పుబట్టారు. దీనిని సవాల్‌‌ చేస్తూ హౌసింగ్‌‌ బోర్డు వేసిన అప్పీల్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం కొట్టేసింది.