హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి (మేడ్చల్), పల్లా రాజేశ్వర్ రెడ్డి (జనగాం) కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వీరిద్దరూ తమ ఎన్నికల అఫిడవిట్లలో సరైన సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ శ్రీనివాస్‌రావు విచారించి నోటీసులిచ్చారు. మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయిన తోటకూర వజ్రేశ్ యాదవ్ పిటిషన్ వేశారు.
మల్లారెడ్డి సూరారంలోని ప్రభుత్వ ల్యాండ్ ని తనదిగా పేర్కొన్నారని తెలిపారు. ఇక..పల్లా ఎన్నికను సవాలు చేస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిటిషన్ వేశారు. పల్లా తన ఎలక్షన్ అఫిడవిట్‌లో వాస్తవాలను వివరించలేదన్నారు. రెండు పిటిషన్లల్లోని ఆధారాలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చింది.