వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసులు

వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసులు
  • దస్తగిరిని సాక్షిగా అనుమతించడంపై పిటిషన్లు

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షిగా పేర్కొనడంపై సీబీఐతోపాటు దస్తగిరికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. కేసులో అప్రూవర్‌గా మారినందున సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి అభ్యర్థనను సీబీఐ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ నిందితులైన డి. శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌. భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌. అవినాశ్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.