రైస్‌ మిల్లుల జప్తు చెల్లదు

రైస్‌ మిల్లుల జప్తు చెల్లదు
  • నిబంధనలకు విరుద్ధంగా చేశారు: హెకోర్టు

హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా చేసిన రైస్ మిల్లుల జప్తు చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. నష్టపరిహారాన్ని రాబ ట్టుకోవడంలో భాగంగా రెవెన్యూ రికవరీ  చట్టం కింద చర్యలు తీసుకునే ముందు అనుసరించాల్సిన విధానం ఒకటి ఉంటుందని, దానికి వ్యతిరేకంగా చేసిన జప్తు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం  నిబంధనలను అనుసరించి మిల్లర్ల నుంచి నష్టాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించింది.

సీఎంఆర్‌ అప్పగించలేదన్న కారణంగా ఆస్తులను జప్తుచేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాదాపు 10కి పైగా రైస్‌మిల్లర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారు వేసిన పిటిషన్ పై జస్టిస్‌  కె.లక్ష్మణ్‌  విచారణ చేపట్టారు. మిల్లర్ల తరపు సీనియర్‌ న్యాయవాది ఆర్‌ఎన్‌ హేమేంద్రనాథ్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. రెవెన్యూ రికవరీ చట్టం కింద మిల్లర్ల నుంచి బియ్యం విలువను రాబట్టే ముందు నిబంధనలు పాటించాల్సి ఉందని పేన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను జప్తు చేయడం చెల్లదని తీర్పు చెప్పారు.