ఫార్ములా ఈ కేసు కు సంబంధించి కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోవడానికి హైకోర్టు అనుమతించలేదు. కేటీఆర్ తో పాటు లాయర్ వెళ్లేందుకు అనుమతించిన కోర్టు.. కేటీఆర్ తో పాటు కూర్చోవడానికి అంగీకరించలేదు. విచారణలో కేటీఆర్ కు దూరంగా ఉండి చూసేందుకు మాత్రమే అనుమతిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
అందులో భాగంగా ముగ్గురు లాయర్ల పేర్లు అడిగింది హైకోర్టు. ముగ్గురిలో ఎవరో ఒకరు కేటీఆర్ వెంట వెళ్లే అవకాశం ఉంది. కనపడేంత దూరంలో ఉండి విచారణను చూడవచ్చని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ 4 గం.లకు వాయిదా వేసింది.
ALSO READ | కేసుల విషయం నేను చూసుకుంటా.. టెన్షన్ అవసరం లేదు: కార్యకర్తలతో కేటీఆర్