హైకోర్టు ఉత్తర్వు అభిలషణీయం : కె.శ్రీనివాసాచారి

ప్రజా ప్రతినిధుల కుర్చీకి ఆధారం భారత రాజ్యాంగం, వాళ్ళ పదవికి ఆధారం భారత రాజ్యాంగమే. నేతల బతుకులకే ఆధారం భారత రాజ్యాంగం..బుధవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును ప్రజలు, పార్టీలు, నాయకులు స్వాగతించా`లి. రాజ్యాంగం మీద ప్రేమ, గౌరవం లేనోళ్ళకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు. భారత రాజ్యాంగం దేశంలోనే అత్యున్నత చట్టం, అన్ని చట్టాలకు మూలమైన చట్టం, దాన్ని గౌరవించడం అందరి బాధ్యత. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించుకునే స్వయం దిద్దుబాటు లక్షణం కలిగి ఉండడం భారత రాజ్యాంగ ఔన్నత్యం. ఏ ప్రభుత్వాలైనా రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి తేదీ నాడు గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నప్పుడే ఫెడరల్ స్ఫూర్తిని కాపాడినట్లు అవుతుంది. 

- కె.శ్రీనివాసాచారి, తూప్రాన్