ఆర్ఎల్సికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్ ఎల్ సి కి హైకోర్టు ఆదేశించింది. సింగరేణి యాజమాన్యం మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదని ఏఐటీయూసీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయం అనంతరం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం తోపాటు సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏకమై ఎన్నికలు నిర్వహించలేదని సీతారామయ్య ఆరోపించారు. నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సానుకూలంగా స్పందించిందన్నారు. సింగరేణి యాజమాన్యం ఆర్ ఎల్ సి వెంటనే స్పందించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని సీతారామయ్య డిమాండ్ చేశారు.