- జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: భావితరాలకు మొక్కలు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. మొక్కల పెంపకానికి చేపట్టిన చర్యలపై రిపోర్టు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలను ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళికతో పాటు రిపోర్టు ఇవ్వాలంది. జనాభాకు తగ్గట్టు మొక్కలు పెంచాలంది. మొక్కల పెంపకంపై హిమాయత్‌నగర్‌కు చెందిన కె.ప్రతాప్‌రెడ్డి వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ శ్రీనివాసరావు తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. జీహెచ్‌ఎంసీ నివేదికను పరిశీలించిన హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సమగ్ర నివేదిక ఇవ్వాలంది. పది మేజర్ పార్కులు, 1000 బయో పార్కులు, 10 గ్రౌండ్ పార్కులు, 138 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయని. శ్మశానాలను డెవలప్ చేశామని రిపోర్టులో ఉండటాన్ని ఆక్షేపించింది. పిల్ 8 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. కార్యాచరణకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.