ఫార్ములా ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది?

ఫార్ములా ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది?
  • ఏసీబీని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్‌‌‌‌ రేస్‌‌‌‌ కేసులో ఏసీబీ దర్యాప్తు సమయంలో న్యాయవాదిని అనుమతించాలంటూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ వేసిన పిటిషన్​పై కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీకి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్​పై మంగళవారం జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది ఎ.ప్రభాకర్‌‌‌‌రావు వాదనలు వినిపిస్తూ విచారణను క్లోజ్​ చేయాలని కోరగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ దర్యాప్తు ఏ దశలో ఉందని ప్రశ్నించారు. 

ఏసీబీ తరఫు న్యాయవాది బాలమోహన్‌‌‌‌రెడ్డి సమాధానమిస్తూ 30 మంది సాక్షులను విచారించామని, 150 డాక్యుమెంట్‌‌‌‌లు సేకరించామన్నారు. విచారణ ముగిసిందని కౌంటరు దాఖలు చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను 21కి వాయిదా వేశారు.