బట్టాపూర్ క్వారీని మూసివేయాలి..హైకోర్టు ఆదేశాలు

నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం బట్టాపూర్  క్వారీని మూసివేయాలని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్వారీ అనుమతులు ముగిసినా అక్రమంగా కొనసాగిస్తున్నారని.. కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు..క్వారీని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ సెక్రెటరీలు, పలువురు ఉన్నతాధికారులు,  సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.  క్వారీ మూసివేత ఆదేశాలతో క్వారీ సమీప గ్రామాల్లో  సంబరాలు నెలకొన్నాయి.