
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన మెట్రో విస్తరణ పనులకు సంబం ధించి పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌం టర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వం తోపాటు ప్రతివాదులకు హైకోర్టు గురు వారం ఆదేశాలు జారీ చేసింది. నాలుగో కారిడార్ నిర్మాణంలో భాగంగా మెట్రో రెండో దశ విస్తరణ పనుల ప్రక్రియను నిలి పివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడ బ్ల్యూఎఫ్) అధ్యక్షుడు మహమ్మద్ రహీం ఖాన్ పిల్ దాఖలు చేశారు.
దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేప ట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం చేపట్టిన విస్తరణ పనుల వల్ల పరిసర ప్రాంతాల్లోని చారి త్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుంద న్నారు. చార్మినార్, ఫలక్‌నుమా, పురాణా హవేలి, దారుల్‌షిఫా, అజాఖాన్ ఆయేజె హ్ర, ఇమా మసీద్, మొగల్‌పురా టూంబ్స్ తదితర కట్టడాలకు ప్రమాదం వాటిల్లు తుందని పేర్కొన్నారు. చారిత్రక కట్టడా లకు సంబంధించి సమగ్ర అధ్యయన నివేదిక సమర్పించేలా, పురావస్తు శాఖ, పర్యావరణ, సామాజిక నిపుణులతో స్వతంత్ర వారసత్వ పరిరక్షణ అథారిటీ లేదా కమిటీతో అధ్యయనం చేయించాలని కోరారు.