
తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎదురు దెబ్బ తగిలింది. హెచ్ సీఏలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్ట్.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది. స్టాఫ్ జీతాలు మినహా ఎలాంటి ఆర్థికపరమైన చర్యలు తీసుకోరాదంటూ హెచ్ సీఏను ఆదేశించింది హైకోర్టు.
హెచ్ సీఏలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే హెచ్ సీఏకు చెందిన రూ.51 లక్షల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో స్పోర్ట్స్ పరికరాలు కొన్నట్లు గుర్తించిన ఈడీ..హెచ్ సీఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేల్చింది. హెచ్ సీఏ సెక్రటరీ, ట్రెజరర్‌లు క్విడ్‌ప్రోకోకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.
Also Read : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపిన గిల్
హెచ్ సిఏ మాజీ ట్రెజరర్ గా ఉన్న సురేందర్ అగర్వాల్ పై అభియోగం నమోదు చేసిన ఈడీ... క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్సీఏ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు విచారణలో గుర్తించింది. అయితే ఈ కాంట్రాక్టులు అప్పజెప్పినందుకు సురేందర్ అగర్వాల్ కు క్విడ్ ప్రోకో కింద మూడు కంపెనీలు రూ. 90 లక్షలు చెల్లించాయి.
సురేంద్ర అగర్ వాల్ తో పాటు అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు రూ. 90 లక్షలకు పైగా నగదు జమ చేశాయి. సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు , కోడలు అకౌంట్లకు ఈ నగదు బదిలీ అయ్యింది. సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ నగదు చెల్లించారు. దీంతో రూ. 90 లక్షల రూపాయలలో 51.29 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.