తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారింది. ఈరోజు (సెప్టెంబర్ 30) హైడ్రా కమిషనర్ హైకోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు పెండింగ్ కేసులో ఉన్న బిల్డింగులను హైడ్రా కూల్చడాన్ని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. హైడ్రా ఇటీవల అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చేసింది. ఆ బిల్డింగ్ నిర్మాణంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కూల్చివేతకు గల వివరణ వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైకోర్టు కోరింది. సోమవారం(నేడు) హైకోర్టు ముందు హాజరు కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.