న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రాంచంద్ర పిళ్ళైకి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పును వెలువరించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరుణ్ పిళ్ళై గతేడాది మార్చి 6న అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరుణ్ పిళ్ళై సన్నిహితుడని, కేసుకు సంబంధించి సౌత్ గ్రూపులో కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు చెల్లింపులు జరిగాయని పేర్కొంది.