నోటీసు ఇచ్చాకే యాంకర్‌ శ్యామలను విచారించాలి..పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం

నోటీసు ఇచ్చాకే యాంకర్‌ శ్యామలను విచారించాలి..పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  సినీ నటి, యాంకర్‌ శ్యామలా రెడ్డికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చాకే బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేశారనే కేసును విచారించాలని పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 24న కేసు దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని శ్యామలకు సూచించింది. ఈ మేరకు జస్టిస్‌ టి.తుకారంజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బెట్టింగ్‌ యాప్‌ కేసులో తనపై పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ శ్యామల వేసిన పిటిషన్‌పై ఆమె తరఫు లాయర్‌ రఘు వాదించారు. పిటిషనర్‌ రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక కక్షపూరితంగా ఆధారాలు లేని కేసులో ఇరికించారని చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.