మరియమ్మ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేయండి

మరియమ్మ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేయండి

అడ్డగూడూరు కస్టోడియల్ డెత్ కేసులో జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించింది హైకోర్టు. మరియమ్మ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రీపోస్టుమార్టం రిపోర్టు షీల్డ్ కవర్  లో సమర్పించాలని తెలిపింది. సివిల్ ప్రొసిజర్ కోడ్ 17A ప్రకారం మెజిస్ట్రేట్ తో ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించింది కోర్టు. ఈనెల 28న పూర్తి నివేదిక సమర్పించాలని విచారణ వాయిదా వేసింది హైకోర్టు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ చనిపోయిందని కోర్టుకు వివరించారు పిటిషనర్ జయవింధ్యాల. బాధిత కుటుంబానికి 5 కోట్ల పరిహరం అందేలా ఆదేశాలివ్వాలని కోరారు.