పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలో వివరణ ఇవ్వండి

పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలో వివరణ ఇవ్వండి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కింది కోర్టు ల్లో ఉన్న అదనపు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశంలో ప్రభుత్వం ఇంత ఉదాసీనత చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కింది కోర్టుల్లో అదనపు, సహాయ పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్లను నియామించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన న్యాయవాది బి. శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. ఈ పిటిషన్​ను ఇటీవల సింగిల్‌‌ జడ్జి విచారించి.. ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్‌‌కు బదిలీ చేశారు. ఈ పిటిషన్‌‌పై తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌ పా ల్, జస్టిస్‌‌ రేణుక యారాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.