
- రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : గ్రూప్‑1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్–1 నోటిఫికేష న్‌లో వర్టికల్ రిజర్వేషన్లు వర్తింప జేయడాన్ని సవాలు చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన ఎం.అర్జున్, కె.అరుణ్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. అన్ని నియామకాల్లోనూ హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ అయిందని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, టీజీపీఎస్సీను ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.