వక్ఫ్​బోర్డు సీఈవోనుతొలగించండి..హైకోర్టు కీలక తీర్పు

వక్ఫ్​బోర్డు సీఈవోనుతొలగించండి..హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వక్ఫ్‌‌‌‌  బోర్డు సీఈవోగా  అసదుల్లాను నియమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వక్ఫ్‌‌‌‌  చట్టం 1995లోని సెక్షన్‌‌‌‌ 23 ప్రకారం వక్ఫ్​ సీఈవో నియామకం జరగలేదని ఆక్షేపించింది. సీఈవో పదవి నుంచి అసదుల్లాను వెంటనే తొలగించాలని, 4 నెలల్లోగా అర్హుడైన అధికారిని ఈసీవోగా నియమించాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌  నగేష్‌‌‌‌  భీమపాక గురువారం తీర్పు చెప్పారు. తాత్కాలిక సీఈవోగా షేక్‌‌‌‌  లియాకత్‌‌‌‌  హుస్సేన్‌‌‌‌ను కొనసాగించవచ్చన్నారు.