హైడ్రా మార్కింగ్స్‌‌‌‌‌‌‌‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నో

హైడ్రా మార్కింగ్స్‌‌‌‌‌‌‌‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నో

హైదరాబాద్, వెలుగు: హైడ్రా మార్కింగ్స్‌‌‌‌‌‌‌‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నగరంలోని పేట్లబుర్జ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో తమ ఇండ్లకు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఆర్‌‌‌‌‌‌‌‌బీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌ అని మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పలువురు అత్యవసరంగా హౌస్‌‌‌‌‌‌‌‌మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. అయితే, హైకోర్టుకు దసరా సెలవులు ముగిసే దశలో హౌస్‌‌‌‌‌‌‌‌మోషన్‌‌‌‌‌‌‌‌ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ నెల 14న తిరిగి ప్రారంభం అయ్యాక  విచారణ చేపట్టే అవకాశముంది. నిజాం కాలంలో తమకు 4.2 ఎకరాల భూమి ఇస్తే.. అందులో గురుద్వార్, హనుమాన్‌‌‌‌‌‌‌‌ మందిర్, యాత్రికుల సౌకర్యార్థం ధర్మశాల నిర్మాణాలతోపాటు పలువురు ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నారంటూ ఎస్‌‌‌‌‌‌‌‌.మహేందర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ మరో 14 మంది పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.

నిజాం కాలంలోనే మూసీకి సరిహద్దు గోడ నిర్మాణం జరిగిందని, దానికి వెలుపలే తమ భూమి ఉందన్నారు. నిజాం కాలంలో తమ పూర్వీకులకు ఇచ్చిన భూమని, ఇంటిపన్ను, నీటిపన్ను, రిజిస్ట్రర్‌‌‌‌‌‌‌‌ డీడ్స్‌‌‌‌‌‌‌‌ అన్నీ ఉన్నాయన్నారు. అక్కడి గురుద్వార్, హనుమాన్‌‌‌‌‌‌‌‌ మందిర్‌‌‌‌‌‌‌‌లకు మహేందర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ సంరక్షకుడిగా ఉన్నారన్నారు. ప్రభుత్వ సిబ్బంది సర్వే చేసి మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో కూల్చివేస్తారనే భయంతో హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని వారు పేర్కొన్నారు.