హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై జ్యడీషియల్ విచారణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పోస్టుమార్టం నివేదిక అందకుండానే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు పిటిషనర్ అభ్యర్థనను అనుమతించలేమని వెల్లడించింది.
బంధువుల సమక్షంలో రెండోసారి ఇంక్వెస్ట్ చేయడానికి కూడా అనుమతించలేమని తేల్చిచెప్పింది. అలాగే, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మల్లయ్య మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. డెడ్‌బాడీ అప్పగింతకు ముందు ఫొటో, వీడియో తీసుకోవడానికి పిటిషర్అయిన ఆయన భార్యను, ఆమె తరఫు లాయర్‌ను అనుమతించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.