Anchor Shyamala: యాంకర్ శ్యామల అరెస్ట్ ని ఆపండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం..

Anchor Shyamala: యాంకర్ శ్యామల అరెస్ట్ ని ఆపండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో తెలుగు యాంకర్ శ్యామలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో యాంకర్ శ్యామల తనని అరెస్ట్ చెయ్యద్దంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు శుక్రవారం ఈ పిటీషన్ ని పరిశిలించింది. అనంతరం యాంకర్ శ్యామలని అరెస్ట్ చెయ్యద్దని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోమవారం పోలీసుల విచారణకి హాజరై సహాకరించాలని శ్యామలకి సూచించింది. దీంతో యాంకర్ శ్యామలకి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.

ALSO READ | పోసానికి మరోసారి బెయిల్..ఈసారైనా జైలు నుంచి రిలీజ్ అవుతాడా..?

ఈ విషయం ఇలా ఉండగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న దాదాపుగా 30మందికి పైగా సినీ సెలబ్రేటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే యాంకర్ శ్యామల గతంలో Andhra365 అనే ఆన్ లైన్ గేమింగ్ యాప్కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేసింది. దీంతో శ్యామలపై కూడా పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణకి రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తన అరెస్ట్ ని ఆపాలని యాంకర్ శ్యామల హైకోర్టుని ఆశ్రయించగా సానుకూలంగా స్పందించింది.