పబ్బుల ముందు హెచ్చరిక బోర్డులు పెట్టాలి 

పబ్బులు వ్యవహారంపై  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పబ్బుల వ్యవహారంలో హైదరాబాద్ పోలుసులు ఊహించిన దానికంటే ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడింది హైకోర్టు. పబ్బుల ముందు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యతని చెప్పింది. పోలీసులు ఆంక్షలను 4వ తేదీ ఉదయం వరకు అమలు పరచాలని ఆదేశించింది. 45 డేసిబుల్స్ కి  శబ్ద కాలుష్యం మించారాదని సూచించింది. పబ్బులకు వెళ్లే జంటలతో పాటు వచ్చే మైనర్లను అనుమతించొద్దని చెప్పింది. వేడుకలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు అమలు పరచాలని స్పష్టంచేసింది. వేడుకలు ముగిసిన తర్వాత.. జరిగిన పరిణామాలు, పోలీసు నివేదికల ఆధారంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది హైకోర్టు. తదుపరి విచారణ 6కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం..

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు