
హైదరాబాద్, వెలుగు: నిజాంపేట ప్రగతినగర్‌లోని ఎరక్రుంట చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌ల్లో ఆక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారంటూ హైడ్రా ఫిర్యాదు కేసులో హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి ఎం. సుధీర్‌కుమార్‌కు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుధీర్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించారు. దర్యాప్తునకు సహకరించడంతో పాటు 8 వారాల పాటు అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.