నో పర్మిషన్.. కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోవద్దు : హైకోర్టు

నో పర్మిషన్.. కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోవద్దు : హైకోర్టు

ఫార్ములా ఈ కేసులో మరో మారు హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు నిరాశే మిగిలింది. విచారణలో తనతో పాటు కూర్చొనేందుకు అడ్వకేట్ ను అనుమతివ్వాలని కోరుతూ ఆయన ఇవాళ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ సమయంలో కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే గదిలో ఉండాలని సూచించారు. 

కేటీఆర్ కోరిక మేరకు న్యాయవాది రాంచందర్ రావు ఇంటరాగేషన్ ను చూడొచ్చని, వినేందుకు వీల్లేదని చెప్పింది.  లైబ్రరీ గదిలో కూర్చొని కిటికీలోంచి వీక్షించవచ్చని తెలిపింది.  ఆ సమయంలో న్యాయవాది రాంచందర్ రావు కనిపించకుంటే మళ్లీ హైకోర్టుకు రావచ్చని సూచించింది.

ALSO READ | ఫార్ములా ఈ కేసు: అరవింద్ కుమార్ ఆదేశాలతోనే రూ.54 కోట్లు బదిలీ: BLN రెడ్డి

ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ సందర్భంగా అడ్వకేట్లను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే విచారణను దూరం నుండి గమనించ వచ్చునని చెప్పిన హైకోర్టు.. అందుకోసం ముగ్గురు అడ్వకేట్ల పేర్లను ఇవ్వాల్సిందిగా సూచించింది. ముగ్గురు అడ్వకేట్లలో అడ్వకేట్ రామచందర్ ఏసీబీ ఆఫీస్ లోకి వెళ్ళాలని పేర్కొంది. విచారణను దూరం నుండి గమనించవచ్చునని స్పష్టం చేసింది హైకోర్టు.