
లాక్ డౌన్ ఎవరు ఉల్లంఘించిన కేసులు నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ 8 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రిపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఆ పిటిషన్ల పై హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద… రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలను, నిబంధనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌లకు హైకోర్ట్ సూచించింది.