మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి భూసేకరణపై హైకోర్టు స్టే

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి భూసేకరణపై హైకోర్టు స్టే

మెట్ పల్లి, వెలుగు : మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 63 బైపాస్ అలైన్మెంట్ భూసేకరణపై హైకోర్టు స్టే విధించినట్లు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దురుషెట్టి పోచయ్య తెలిపారు. హైవేకు బైపాస్ నిర్మించేందుకు మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం బండలింగపూర్, వెల్లుల్ల, మేడిపల్లి, చౌలమద్ది, పెద్దపూర్ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూముల సేకరణకు అధికారులు రైతులకు నోటీసులు పంపించారు. 

ఈ నేపథ్యంలో బైపాస్ అలైన్మెంట్ రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేశారు. అయినా హైవే అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు భూసేకరణపై స్టే ఇచ్చినట్లు అడ్వకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోచయ్య తెలిపారు.