దొంగల్లో కూడా డిఫరెంట్ దొంగలు ఉంటారనేందుకు తాజాగా మరో ఉదాహరణ తెరమీదకివచ్చింది. సాధారణంగా దొంగలు.. బైకులపై వస్తున్నారని మాత్రమే తెలుసు. పోనీ.. బస్సుల్లో వచ్చి పనిముగించుకుని కిమ్మనకుండా వెళ్లిపోతున్నారు. కానీ.. తాజాగా కేరళ పోలీసులు అరెస్టు చేసిన దొంగ స్టయిలే వేరు. ఈ దొంగ విమానాల్లాలో ప్రయాణిస్తూ.. తాళాలు వేసిన ఇళ్లలో కన్నాలు వేస్తున్నాడట. పైగా.. తెలంగాణ కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరి ఈ కథేంటో తెలుసుకుందామా...
చోరీలు చేసి తప్పించుకునేందుకు కొందరు నిందితులు ప్రయత్నాలు చేస్తే.. మరికొందరు మాత్రం చోరీల కోసం భిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురంలో తాళంవేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగతనాలు చేసేందుకు అతడు ఏకంగా విమానాల్లో వెళ్తుండటం గమనార్హం.
తాళం వేసి ఉన్న ఇళ్ల నుంచి బంగారాన్ని దొంగిలించడానికి విమానం లో ప్రయాణించే హై ప్రొఫైల్ దొంగను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ వాసి ఉమాశంకర్ ను తిరువనంతపురం విమానాశ్రయం వద్ద పక్కా సమాచారంతో అదుపు లోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్.. ఆలయ దర్శనం కోసం మే నెల లో తిరువనంతపురాని కి వచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ తన సొంత రాష్ట్రం నుంచి విమానాల్లో వెళ్తుంటాడని గత రెండు నెలల్లో నాలుగుసార్లు వెళ్లాడని తెలిపారు.
Also Read :- కోటీశ్వరుడైనా బిచ్చగాడు : అడుక్కున్న డబ్బులతో అపార్ట్మెంట్లు, షాపులు
మే నెలలో ఈ వ్యక్తి కేరళకు తరచుగా విమానాల్లో వెళ్లాడు, కేరళకు వెళ్లిన తరువాత ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. అనంతరం గూగుల్ మ్యాప్ సహాయంతో రాత్రి సమయాల్లో మళ్లీ అక్కడకు వెళ్లి.. ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు. . జూన్ లో ప్రణాళిక వేసుకున్న అతడు.. ఇళ్లలో చోరీ చేసేందుకు ఇటీవల మళ్లీ వచ్చాడు. కేవలం బంగారు నగలు మాత్రమే ఎత్తుకెళ్లేవాడు. వాటిని ఖమ్మం మాత్రం తీసుకెళ్లేవాడు కాదు. వాటిని తాకట్టు పెట్టి డబ్బు మాత్రమే తీసుకునేవాడు’ అని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సీహెచ్ నాగరాజు వెల్లడించారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఈ ‘హై ప్రొఫైల్ దొంగను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
శంకర్ వద్ద ఇంట్లోకి చొరబడి బంగారాన్ని తీసుకెళ్లేందుకు ఉపయోగించే పూర్తి కిట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బంగారం తో డికాంప్ చేసిన తర్వాత అతను ఆ బంగారాన్ని తాకట్టు పెట్టాడు. అయితే.. ఇలా తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకోవడానికి తిరిగిరాడని చెప్పారు. తిరువనంతపురం నగరం లో శంకర్ మూడుసార్లు దొంగతనానికి ప్రయత్నాలు చేసి ఆరు లక్షల రూపాయల కు పైగా బంగారం దొంగిలించి తాకట్టు పెట్టాడ ని వివరించారు.
దోపిడీ ఘటనలు నమోదైన తర్వాత పగటిపూట శంకర్ ను తీసుకెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ నుండి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. శంకర్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల కు ఆటో రిక్షా డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఉపయోగపడింది. తెలంగాణ లో శంకర్ పై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు కేరళ పోలీసులు తెలిపారు.