పెద్దపల్లి జిల్లాలో డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిలు

పెద్దపల్లి జిల్లాలో  డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిలు
  • పెద్దపల్లి జిల్లాలో నిర్వహణ లేక దెబ్బతింటున్న బ్రిడ్జిలు
  • 20 ఏండ్లుగా రిపేర్లు చేయని వైనం 
  • పగిలిపోతున్న స్లాబులు.. పైకి తేలుతున్న చువ్వలు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో వాగులు, కాలువల మీద కట్టిన బ్రిడ్జిల నిర్వహణ లేక దెబ్బతింటున్నాయి. 20 ఏండ్లుగా రిపేర్లు లేకపోవడంతో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి. బ్రిడ్జిలపై స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య గ్యాపుల్లో సిమెంటు పోవడంతో పెద్ద గాలాలు ఏర్పడ్డాయి. దీంతోపాటు బ్రిడ్జిల మీద ఇసుక, చెత్త పేరుకుపోతుండటంతో వర్షపు నీళ్లు కిందికి పోవడానికి ఏర్పాటు చేసిన నాళాలు మూసుకుపోతున్నాయి. 

మెయింటనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోలే

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మానేరు, హుస్సేన్​మియా వాగుపై చిన్న, పెద్ద బ్రిడ్జిలు సుమారు 25 వరకు ఉన్నాయి.  బ్రిడ్జిలు కట్టాక మూడు, నాలుగేళ్లకోసారి రిపేర్లు చేయాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ బ్రిడ్జిల్లో చాలావరకు మూడు దశాబ్దాలు కింద కట్టినవే ఉన్నాయి.  కాంట్రాక్టు నిబంధనలకు ప్రకారం నిర్మాణం పూర్తయ్యాక నిర్ణీత కాలం వరకు కాంట్రాక్టర్ల మెయింటనెన్స్​ బాధ్యత ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడ కన్పించడం లేదు. మానేరు, హుస్సేన్​ మియావాగు ప్రవహించే సుల్తానాబాద్​, పెద్దపల్లి, ముత్తారం, జూలపల్లి, మంథని మండలాల్లోనే ఎక్కువ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇవన్నీ మెయింటనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేక దెబ్బతింటున్నాయి. 
    
మంథని మండలం అడవి సోమన్​పల్లి బ్రిడ్జి రిపేర్​ చేయాల్సి ఉండగా నామమాత్రంగానే ప్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్​ చేసి వదిలేశారు. పెద్దపల్లి మండలం మూలసాల వద్ద బ్రిడ్జికి కూడా రిపేర్లు చేయాల్సి ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. బోజన్నపేట గ్రామానికి చెందిన కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ మరో బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నా దానినే వినియోగిస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్​ మండలం 
గంగారం వద్ద ఉన్న బ్రిడ్జి స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల జాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య గ్యాప్​ పెరిగి పెద్ద గాలాలు ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. మొట్లపల్లి వద్ద ఉన్న లెవల్​ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. మంథని నియోజకవర్గం అడవి సోమన్​పల్లి వద్ద మూడు దశాబ్దాల కింద మానేరుపై కట్టిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. పగుళ్లు ఏర్పడి స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేలుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. మంథని నుంచి వరంగల్, భూపాలపల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిపై ఈ బ్రిడ్జి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యమ్నాయంగా మరో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది.