IND vs ENG 4th Test: కుల్దీప్ లెఫ్ట్ హ్యాండర్ షేన్ వార్న్: ఇంగ్లాండ్ కెప్టెన్

IND vs ENG 4th Test: కుల్దీప్ లెఫ్ట్ హ్యాండర్ షేన్ వార్న్: ఇంగ్లాండ్ కెప్టెన్

టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాంచీ టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్లేమీ తీయకపోయినా.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు 100 కు పైగా బంతులు ఎదుర్కొని కీలకమైన 28 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ కు ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. అతన్ని షేన్ వార్న్ తో పోల్చాడు. 

కుల్దీప్ ఈ రోజు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అతని బౌలింగ్ చేస్తే షేన్ వార్న్ లెఫ్ట్ హ్యాండర్ తో బౌలింగ్ చేస్తున్నాడేమో అనిపించింది అని వాన్ అన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామ్యాన్ బౌలర్.. ఓపెనర్ జాక్ క్రాలీ, కెప్టెన్ బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్‌ల వికెట్లను తీసి ఇంగ్లాండ్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యేలా అవ్వడంతో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ తో పాటు అశ్విన్ 5 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే ఆలౌట్ అయింది.
 
రాంచీ టెస్టులో ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే మరో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. క్రీజ్ లో గిల్(13), జడేజా (2) ఉన్నారు. రోహిత్ శర్మ (55), జైశ్వాల్ (37), పటిదార్ (0) ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హార్టిలి, రూట్, బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.